అరకు కాఫీకి మరింత విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అందుబాటులోకి తెచ్చింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో అసెంబ్లీ లాబీల్లో మూడు స్టాళ్లను ఏర్పాటు చేశారు. మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. అందులో చేసిన కాఫీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సీఎంకు అందజేశారు. ఆయన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ సీఎంల చేతికందించారు. సేంద్రియ కాఫీ పొడి అయినందున ప్రత్యేక రుచి వచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఉత్పత్తులను ఇంకా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

