ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అస్సాంలోని నామ్‌రూప్ వద్ద రూ.10,601 కోట్ల వ్యయంతో అమ్మోనియా-యూరియా ఉత్పత్తి ఫ్యాక్టరీ నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
మహారాష్ట్రలో రూ.4,500.62 కోట్లతో 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం.
దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు, పాల ఉత్పత్తుల అభివృద్ధి కార్యక్రమాలకు రూ.2,790 కోట్లు కేటాయింపు.
రూ.2,000 కంటే తక్కువ విలువ కలిగిన యూపీఐ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు లేకుండా, రూ.1,500 కోట్ల ఇన్సెంటివ్ ప్రభుత్వం అందజేస్తోంది.