వేసవి ఎండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. రేపటి నుండి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఎండవేడిమి కి తాళలేక పోతున్నారు. వర్షాలతో కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది.
Previous Articleగర్వంగా చెప్తున్నా…కౌరవ సభ గౌరవ సభగా మారింది:ఏపీ సీఎం చంద్రబాబు
Next Article కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ బిడ్..!

