భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదంపై పరిష్కారానికి చర్చలు జరుగుతున్న వేళ చైనా మరోసారి తన కపట బుద్ది చూపుతూ కవ్వింపు చర్యలకు ఉపక్రమించింది. లద్దాఖ్ ప్రాంతంలో కొన్ని చోట్ల కౌంటీలను ఏర్పాటు చేస్తోంది. భారత్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి దురాక్రమణలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. రెండు కొత్త కౌంటీలను చైనా ఏర్పాటు చేయడం మా దృష్టికి వచ్చింది. అక్కడ కొన్ని భూభాగాలు లద్దాఖ్ పరిధిలోకి వస్తాయి. భారత భూభాగాలు ఆక్రమించడం ఎప్పటికీ సహించబోమని పేర్కొంది. భారత సార్వభౌమాధికారానికి సంబంధించి మా దీర్ఘకాల, స్థిరమైన వైఖరిపై ఈ కౌంటీల ఏర్పాటు ప్రభావం చూపదని ఈ చర్యలు చైనా చేస్తున్న బలవంతపు ఆక్రమణలకు చట్టబద్ధత కల్పించలేవని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు. దీనిపై భారత్ నిరసనను దౌత్య మార్గాల ద్వారా తెలియజేసినట్లు వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు