‘ఎర్త్ అవర్’ ప్రాముఖ్యతను వివరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. భూమి మన ఏకైక నివాసం, కాబట్టి దానిని రక్షించేందుకు మనం సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం, Earth Hour ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకువస్తూ, మన గ్రహాన్ని పరిరక్షించేందుకు దోహదం చేస్తుందని 60 నిమిషాల పాటు అందరినీ ఏకతాటిపైకి తెస్తుందని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఇది మార్చి 22న వస్తోంది, అలాగే ఈరోజు ప్రపంచ జల దినోత్సవం కూడా. వనరులను సంరక్షించేందుకు స్థిరమైన రేపటి కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది, కానీ ఈ ప్రయత్నాలు ప్రతి వ్యక్తి భాగస్వామ్యంతోనే నిజమైన అర్థం పొందుతాయని స్పష్టం చేశారు. చిన్న పనులే గొప్ప మార్పుకు దారి తీస్తాయి. మనమంతా కలిసి పని చేస్తే, ఒక విప్లవాత్మక ప్రభావాన్ని కలిగించగలమని పేర్కొన్నారు. అందరూ తమంతటతాముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, భూమిని కాపాడటానికి తమవంతు కృషి చేయాలని కోరారు.
Earth is our only home, and we must do everything we can to protect it. Every year, Earth Hour unites millions across the globe for 60 minutes to celebrate and support our planet.
This year, Earth Hour falls on March 22, coinciding with World Water Day. This meaningful overlap… pic.twitter.com/eGoM30bv0E
— N Chandrababu Naidu (@ncbn) March 22, 2025