విశాఖ స్టేడియం లో మౌలిక వసతులు కేవలం రెండు నెలల్లో ఆధునికీకరణ జరిగిందని విజయవాడ ఎంపీ,ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ నెలలో విశాఖలో జరిగే రెండు ఐపీఎల్ మ్యాచ్ ల తర్వాత ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని అమరావతి లో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు . అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి జైషా అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. బీసీసీఐ కూడా ఏపి లో క్రికెట్ అభివృద్ధి కి సహకారం అందిస్తుందని విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నామన్నారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి క్రీడాకారులు గా తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు.
అమరావతి లో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి…అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి అనుమతి
By admin1 Min Read

