టాలీవుడ్లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమాను థియేటర్లలో తిరిగి విడుదల చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 11న ఈ చిత్రాన్ని 4K ఫార్మాట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.అయితే టైమ్-ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లోనే విపరీతమైన ఆదరణ పొందింది.అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ నటనకు మంచి ప్రశంసలు లభించాయి.ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారు.త్వరలో ‘ఆదిత్య 999’ పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను బాలకృష్ణ రూపొందించనున్నట్లు సమాచారం.అభిమానులు ఈ రీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Previous Articleగూగుల్, ఓపెన్ ఏఐ ప్రతిపాదనపై మండిపడుతున్న హాలీవుడ్ సెలెబ్రిటీలు
Next Article పాస్టర్ హింసాత్మక ప్రవర్తన…!