మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఫహీమ్‌ఖాన్ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నాగ్‌పూర్ మున్సిపల్ శాఖ అధికారులు సోమవారం ఉదయం అతని నివాసంతో పాటు ఇతర నిర్మాణాలను బుల్డోజర్‌తో కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కారణంగా ముందే నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. మార్చి 17న నగరంలో మతపరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అల్లర్లు చెలరేగడంతో, కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం ప్రచారం చేయడంతో హింస మరింత తీవ్రతరం అయింది. ఈ తప్పుడు వదంతుల కేసులో ఫహీమ్‌ఖాన్‌తో పాటు ఆరుగురిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. సైబర్ విభాగం ద్వారా ఇప్పటివరకు నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మొత్తం 200 మంది నిందితులను గుర్తించినట్లు, మరికొందరిని సీసీటీవీ ఆధారంగా గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
నాగ్‌పూర్ హింసాత్మక ఘటన ప్రధాన నిందితుడి అక్రమ కట్టడాలపై బుల్డోజర్ చర్య..!
By admin1 Min Read
Previous Articleకెనడాలో మధ్యంతర ఎన్నికలు
Next Article అమెరికాలో ఐబీఎం భారీ ఉద్యోగ సంక్షోభం

