మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన స్కిట్ తీవ్ర వివాదాస్పదమైంది. షోలో భాగంగా షిండేను దేశద్రోహిగా పేర్కొంటూ ఓ పాట పాడటంతో మహా రాజకీయాలు వేడెక్కాయి. శివసేన నేతలు కమ్రాపై మండిపడుతున్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై స్పందిస్తూ, హాస్యం పేరుతో ఇతరులను అగౌరవపరచడం తగదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. షో జరిగిన హాబిటాట్ కామెడీ క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కమ్రాపై కేసు నమోదైంది. తాజా పరిణామాల నేపథ్యంలో హాబిటాట్ స్టూడియో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు