భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు ఇచ్చిందని, అయితే దానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు.ఏ విషయానికైనా హద్దు ఉంటుందని, ఆ హద్దు దాటి మాట్లాడితే మూల్యం చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు.స్టాండప్ కమేడియన్ కునాల్ కామ్రా తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. విమర్శలు, సెటైర్లను ప్రోత్సహిస్తానన్నా, అవి సంస్కారపద్ధతిలో ఉండాలని సూచించారు.
కామ్రా తనపై సెటైర్లు వేయడానికి ఎవరితోనో సుపారీ తీసుకున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు.ముంబైలో ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన ఓ ఈవెంట్‌లో కామ్రా చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. ఆయన ఏక్ నాథ్ షిండేను “ద్రోహి” అంటూ చేసిన వ్యాఖ్యలపై శివసేన (షిండే వర్గం) కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో సదరు హోటల్‌పై దాడికి దిగిన కార్యకర్తలు, ఫర్నిచర్, కిటికీలు, మైకులు, సీలింగ్ వంటి వస్తువులను ధ్వంసం చేశారు.