ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. పలు రకాల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలు, సీ.ఆర్.డీ.ఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు. అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపుగా పూర్తయ్యాయి.ఐఐటీ మద్రాస్ ద్వారా బిల్డింగ్ నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి కొన్ని సమస్యలు పరిష్కరించాం. 90% పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. మంత్రులు, జడ్జీలు, కార్యదర్శుల కోసం 186 బంగళాలు, గెజిటెడ్ అధికారులకు 1440, ఎన్జీవోలకు 1995 భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. హైకోర్ట్ భవనం 16.85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అసెంబ్లీ భవనం 250 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతుంది. ఒక 15 రోజుల్లో కాంట్రాక్టర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

