గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీ.ఎస్.టీ) నుండి ప్రసాదాన్ని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈమేరకు లోక్ సభలో ప్రకటించారు. నేడు లోక్ సభలో ఆర్థిక బిల్లు 2025పై జరిగిన చర్చపై ఆమె మాట్లాడారు. ఈసందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. ఆలయాలు, ప్రార్థనా స్థలాలలో లభించే ప్రసాదాలపై జీ.ఎస్.టీ వర్తింపు ఉండదని స్పష్టం చేశారు. ఆన్ లైన్ యాడ్స్ పై ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ ట్యాక్స్ ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లోక్ సభ లో ఆర్థిక బిల్లు 2025కి ప్రతిపాదించిన 59 సవరణల్లో ఇది ఉంది. ఇక బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో తీసుకొచ్చిన కొత్త ఇన్ కం టాక్స్ బిల్లును తదుపరి వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 13న ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఈ కమిటీ దీనిపై అధ్యయనం చేసి రానున్న పార్లమెంట్ సమావేశాల తొలి రోజు నాటికి నివేదికను సమర్పించాల్సి ఉంది. దీని కారణంగా దీనిపై వర్షాకాల సమావేశాల్లో చర్చ చేపడుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
జీ.ఎస్.టీ నుండి ప్రసాదాలకు మినహాయింపు… ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
By admin1 Min Read
Previous Articleపార్లమెంట్‌లో ‘ఛావా’ ప్రత్యేక ప్రదర్శన…?
Next Article నేటి ట్రేడింగ్ లో ఫ్లాట్ గా ముగిసిన సూచీలు..!