కోల్ కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో పాయింట్ల ఖాతా తెరిచింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ద్రువ్ జురెల్ (33), యశస్వీ జైశ్వాల్ (29), రియాన్ పరాగ్ (25) పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. వైభవ్ అరోరా, హార్షిత్ రాణా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. స్పెన్సర్ జాన్సన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో కోల్ కతా డికాక్ 97 నాటౌట్(61; 8×4, 6×6) రాణించడంతో 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రఘవన్షీ (22 నాటౌట్) రాణించాడు.
ఐపీఎల్ -18: పాయింట్ల ఖాతా తెరిచిన డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా… రాజస్థాన్ పై ఘన విజయం
By admin1 Min Read
Previous Articleరామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ – ఆర్‌సీ16 ఫస్ట్‌లుక్ రివీల్
Next Article సెపక్ తక్రా వరల్డ్ కప్ లో భారత్ కు గోల్డ్..!