బైలేటరల్ వాణిజ్య ఒప్పందాల విషయంలో చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను చూడబోమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుండి అమలులోకి వచ్చే నేపథ్యంలో భారత్ మరియు అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ – యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన టీంతో కలిసి భారత్ కు వచ్చారు. ఈ క్రమంలో భారత అధికారులతో వారు చర్చలు ప్రారంభించారు. ఇరుదేశాలు వాణిజ్యంపై ఈ వారంలోనే నాటికి ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాలకు సంతృప్తికరమైన ఫలితం ఉంటుందని భావిస్తున్నట్లు చర్చల్లో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. కాగా, ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ లో వాషింగ్టన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

