ఆసియాలోనే అతిపెద్దదైన ఇందిరాగాంధీ మెమోరియల్’ తులిప్ గార్డెన్స్ ‘ తాజాగా పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు. ఇది 50 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాల్ లేక్, జబర్వాన్ హిల్స్ కు మధ్యలో ఉన్న ఈ గార్డెన్ ను తెరవడంతో ప్రతి ఏటా కాశ్మీర్ లో టూరిజం సీజన్ ప్రారంభమవుతుంది. ఈసారి తులిప్ పుష్పాల ప్రదర్శనను జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. అనంతరం గార్డెన్ లో విహారిస్తూ టూరిస్ట్ లతో ముచ్చటించారు. ఇక ఈ ఉద్యానవనాన్ని 2007లో అప్పటి జమ్మూ కాశ్మీర్ సీఎం గులాం నబీ ఆజాద్ ప్రారంభించారు.

కాశ్మీర్ లో తెరచుకున్న ‘తులిప్ గార్డెన్స్’: మొదలైన టూరిస్ట్ ల సందడి
By admin1 Min Read

