రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు వరకు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరింత సులభతరం చేసింది. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు వరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మార్పు ద్వారా ప్రయాణికులకు ప్రయాణ అనుభవం మరింత సౌలభ్యంగా మారనుంది.
అదనపు చార్జీ లేకుండా ప్రయాణికులు ఎన్నిసార్లయినా తమ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవచ్చు. అయితే, రైలు బయల్దేరడానికి 24 గంటల లోపు బోర్డింగ్ స్టేషన్ను మార్చినప్పుడు టికెట్ రీఫండ్ లభించదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధన ప్రయాణికులకు మరింత అనువుగా మారనుండగా, టికెట్ రద్దు సమస్యలను కూడా తగ్గించనుంది.

