ఐపీఎల్-18 షెడ్యూల్ లో ఒక మ్యాచ్ కు సంబంధించి మార్పు జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య వచ్చే ఆదివారం ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ వచ్చే మంగళవారం ఏప్రిల్ 8వ తేదీకి మార్చారు. ఏప్రిల్ 6న నగరంలో శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవాలు ఉండడంతో క్రికెట్ కోసం పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయించలేమన్న కోల్ కతా పోలీసుల విజ్ఞప్తి మేరకుబీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6న రెండు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఆరోజు మధ్యాహ్నం 3.30కు కోల్ కతా -లక్నో మ్యాచ్ తేదీ మారగా.. హైదరాబాద్ వేదికగా జరిగే రెండో మ్యాచ్ హైదరాబాద్-గుజరాత్ రా.7.30 ఎటువంటి మార్పు లేకుండా జరగనుంది. ఇక ఏప్రిల్ 8న రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. కోల్ కతా -లక్నో మధ్యాహ్నం 3.30కు, పంజాబ్ చెన్నై చంఢీగడ్, రా. 7.30కు తలపడతాయి.
Previous Articleభారత రెజ్లర్ మనీషా బల్వాలాకు గోల్డ్ మెడల్
Next Article పంజాబ్ స్ప్రింటర్ గుర్వీందర్ సింగ్ నేషనల్ రికార్డు