మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదల వాయిదా పడింది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా, మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహాభారతం ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ముందుగా ఏప్రిల్ 25న విడుదల చేయాలని భావించినప్పటికీ, VFX పనుల్లో ఆలస్యం కారణంగా సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అయిందని మంచు విష్ణు ప్రకటించారు.”అత్యున్నత ప్రమాణాలతో సినిమాను అందించాలనే ఉద్దేశంతో కొంత సమయం పడుతుంది” అంటూ, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అభిమానులు మళ్లీ కొత్త విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025