పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయినప్పటికీ,ఆయన నటించిన ‘ఓజీ’ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 50% షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్, మే-జూన్ నెలల్లో 25 రోజుల షెడ్యూల్లో మిగిలిన షూటింగ్‌ను పూర్తిచేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ సెప్టెంబర్‌లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో కనిపించనున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.అయితే ఇది పవన్ కళ్యాణ్ చివరి సినిమా అవుతుందా? లేదా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా చేస్తారా? అనేది వేచి చూడాలి.
Previous Articleనవంబర్‌లో రానున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’…!
Next Article వాయిదా పడిన ‘కన్నప్ప’ సినిమా విడుదల!