కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. పార్లమెంటులో చర్చలు సరిగ్గా జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. చర్చలను నివారించేందుకు పలు వ్యూహాలు వేస్తుందని అన్నారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రక్రియను చిన్న చూపు చూస్తుందని విమర్శలు గుప్పించారు. గడిచిన కొన్ని సమావేశాలను గమనిస్తున్నాను. ఏదైనా అంశంపై ప్రతిపక్షాలు నిరసనలు చేసే సమయంలో వారిని రెచ్చగొట్టి విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకోవడం జరుగుతుందని ఆక్షేపించారు. ఈవిధంగా చేయడం విచారకరమని అన్నారు.
పార్లమెంటులో కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విమర్శలు
By admin1 Min Read

