టాలీవుడ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.ఉగాది,రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని సినీ ప్రియులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు చిత్ర పరిశ్రమ సిద్ధమైంది.ఇప్పటికే ఉగాది సందర్భంగా భక్తులు గుళ్లకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించగా,ఇంట్లో ఉగాది పచ్చడి స్వీకరిస్తూ నూతన సంవత్సరాన్ని స్వాగతించుకున్నారు.ఇదే సమయంలో ముస్లింలు రంజాన్ మాసాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా పలు సినీ నిర్మాణ సంస్థలు తమ చిత్రాలకు సంబంధించిన కొత్త పోస్టర్లు,టీజర్లు విడుదల చేయడం ద్వారా అభిమానులను ఆనందింపజేశాయి.స్టార్ హీరోల నుంచి యంగ్ టాలెంట్ వరకూ చాలా మంది నటించిన సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తుండటంతో టాలీవుడ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్లు రాబోతున్నాయని సమాచారం.
Previous Articleపూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో కొత్త సినిమా…!
Next Article ఐపీఎల్-18: బోణీ కొట్టిన రాజస్థాన్ … చెన్నై పై విజయం