భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీందర్ సింగ్ కొత్త నేషనల్ రికార్డు సృష్టించాడు. యూఎస్ లోని కాలిఫోర్నియాలో జరిగిన యూఎస్ఏ అథ్లెటిక్స్ మీట్ లో పురుషుల 10వేల మీటర్ల రన్ లో 27 నిమిషాల 0.22 సెకన్ల టైమింగ్ లో 6వ స్థానంలో నిలిచాడు. ఈక్రమంలో తన రికార్డును తానే అధిగమించాడు. ఇంతకు ముందు హాచియోజి మీట్ లో 27 నిమిషాల 14.88 సెకన్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మరోవైపు భారత రన్నర్ లు కార్తీక్ ఈ యూఎస్ మీట్ లో 28 నిమిషాల 11.34 సెకన్లతో 8వ స్థానంలో నిలిచాడు. 1500 మీటర్లలో రాహుల్ 3 నిమిషాల 41.10 సెకన్లలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మహిళల 10 వేల మీటర్ల రేసులో సీమా 32 నిమిషాల 14.66 సెకన్లలో 19వ స్థానంలో నిలిచింది. 1500 మీటర్లలో అంకిత 4 నిమిషాల 13.97 సెకన్లలో మూడో స్థానంలో నిలిచింది.
Previous Articleఐపీఎల్-18: బోణీ కొట్టిన రాజస్థాన్ … చెన్నై పై విజయం
Next Article ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

