ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) లావాదేవీలకు కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం, ఇన్‌యాక్టివ్ నంబర్లను డీయాక్టివేట్ చేయనున్నారు. చాలాకాలంగా యూపీఐ సేవలను ఉపయోగించని వినియోగదారులు తమ బ్యాంక్‌లో వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, యూపీఐ ప్రొవైడర్లు (గూగుల్ పే, ఫోన్ పే తదితరులు) అచేతన నంబర్లను తొలగించాల్సి ఉంటుంది.ఇంకా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు కూడా మార్చనున్నారు. SBI, PNB, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయని ఖాతాదారులకు జరిమానా విధించనున్నారు.
ఇంకా, కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం రూ. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు అందుబాటులోకి రానుంది. అలాగే, యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలులోకి రానుంది, దీని ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది.అంతేకాదు, కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్ల విధానాన్ని కూడా మార్చనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి, కాబట్టి బ్యాంక్ ఖాతాదారులు ముందుగా తగిన చర్యలు తీసుకోవడం మంచిది.