కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశంసించారు.కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా దౌత్యాన్ని ఆయన కొనియాడారు.‘ద వీక్’ మ్యాగజైన్‌లో రాసిన కథనంలో థరూర్,భారత్ అంతర్జాతీయ ఆరోగ్య దౌత్యంలో కీలకమైన దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు.సుమారు వందకుపైగా దేశాలకు ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్లు సరఫరా చేయడం ద్వారా భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని వెల్లడించారు.కోవాక్స్ ప్రోగ్రామ్‌కు భారత్ అందించిన సహకారాన్ని కూడా ఆయన ప్రశంసించారు.అయితే,విదేశాంగ విధానాలను మెచ్చుకున్నప్పటికీ తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు ఆయన వ్యాఖ్యలతో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.కోవిడ్ రెండో వేవ్ సమయంలో వ్యాక్సిన్ సరఫరా నిలిచినా,భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు.‘వసుధైవ కుటుంబకం’ అనే భావాన్ని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని థరూర్ తన కథనంలో వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు