బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చాట్రగడ్డ గ్రామంలో సనాతన వేదాంత నిష్ఠాశ్రమ శ్రీ సరస్వతీ విద్యామందిర్ పాఠశాల నూతన భవనాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్, మంత్రి అనగాని సత్యప్రసాద్ , అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ , ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొన్నారు. రూ.9 కోట్లతో నిర్మించనున్న కొత్త భవనాలకు భూమిపూజ చేశారు.ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యాభారతి ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలు, క్రమశిక్షణ, బోధనతో దేశవ్యాప్తంగా 24,128 పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో చదివి ఇప్పటివరకు 6 కోట్ల 30 లక్షల మంది తమ కుటుంబాల్లో వెలుగులు నింపారు. అదే బాటలో.. వెనకబడిన తీరప్రాంత గ్రామాల్లో విద్యావెలుగులు పంచుతున్న ఎస్వీఎన్ఏ పాఠశాల ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన చేయూత అందించడానికి సిద్ధమని అలాగే రేపల్లె కమ్యూనిటీ ఆస్పత్రిని 100 పడకల ఏరియా ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ‘విద్యాదానం మహాదానం’ అనే విషయాన్ని గుర్తించి వందేళ్ల కిందటే భూమి ఇవ్వడంతోపాటు విరాళాలతో పాఠశాల ఏర్పాటుకు నేతృత్వం వహించిన దాతలు శ్రీ వీరమాచినేని ఆంజనేయ శాస్త్రి గారు, మైనేని రాజగోపాల్ రావు గారు, వెలగపూడి రామకృష్ణ గారు, సీతారామయ్య గారికి ధన్యవాదాలు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ పాఠశాలను తీర్చిదిద్దుతున్న ఎస్వీఎన్ఏ సరస్వతి విద్యామందిర్ కమిటీ సభ్యులకు మంత్రి సత్య కుమార్ అభినందనలు తెలిపారు.
Previous Articleచీమలు మానవాళికి మిత్రులు …!
Next Article సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ మూవీ ట్రైలర్ రాబోతోంది…!