తెలుగు తేజం, విశాఖకు చెందిన యువ స్కేటర్ దొంతారా గ్రీష్మ కు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తైవాన్ లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో తెలుగమ్మాయి, విశాఖకు చెందిన యువ స్కేటర్ దొంతారా గ్రీష్మ మూడు విభాగాల్లో బంగారు పతకాలను సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో రాష్ట్రానికి, దేశానికి గ్రీష్మ మంచి పేరు తీసుకు వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
యువ స్కేటర్ దొంతారా గ్రీష్మ రాష్ట్రానికి గర్వకారణం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read