రాజస్థాన్‌లోని బీవార్‌లో ఘోర ప్రమాదం జరిగింది.బదియా ప్రాంతంలోని సునీల్ ట్రేడింగ్ కంపెనీ గోదాములో పార్క్ చేసిన ట్యాంకర్ నుండి నైట్రోజన్ గ్యాస్ లీక్ అయ్యింది.ఈ ఘటనలో కంపెనీ ఓనర్ సునీల్ సింఘాల్ ఊపిరాడక మృతి చెందగా,మరో 40 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.స్థానికులు గ్యాస్ లీకేజీ గురించి గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా,అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరిసర ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.గ్యాస్ ప్రభావంతో పలు పెంపుడు జంతువులు,వీధి కుక్కలు మరణించాయి.ప్రస్తుతం లీకేజీని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
రాజస్థాన్‌లో నైట్రోజన్ గ్యాస్ లీక్ – ఒకరు మృతి, 40 మంది ఆసుపత్రిలో చికిత్స…!
By admin1 Min Read