రష్యాలో కొత్త రకం వైరస్ కు సంబంధించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వైరస్ అక్కడ వ్యాపిస్తున్న టైర్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. వైరస్ వల్ల వారు దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నివేదికలను రష్యన్ అధికారులు ఖండించారు. తాము జరుపుతున్న టెస్టులలో దేశంలో ఎలాంటి కొత్త వ్యాధి కారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. రకరకాల వదంతులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో వాస్తవం లేదన్నారు. ఒకవేళ కొవిడ్ తరహా వైరస్ వస్తే దాని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
రష్యాలో కొత్త రకం వైరస్ కు సంబంధించిన వార్తలు…ఖండించిన అధికారులు
By admin1 Min Read