భారత స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్య ఐసీసీ టీ20 ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుండి అక్షర్ పటేల్, అభిషేక్ శర్మలు వరుసగా 12,13 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి 3వ స్థానంలో, రవి బిష్ణోయ్ 7వ స్థానంలో, అర్ష్ దీప్ సింగ్ 10వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ 2వ స్థానంలో, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ 4,5 వ స్థానాల్లో కొనసాగుతున్నారు. యశస్వీ జైశ్వాల్ 13వ స్థానంలో నిలిచాడు.
ఐసీసీ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న హార్థిక్ పాండ్య
By admin1 Min Read