అమరావతి నిర్మాణ కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో వరల్డ్ బ్యాంకు గుడ్ న్యూస్ తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణాల కోసం ఇప్పటికే వరల్డ్ బ్యాంకు రూ.6,700 కోట్లు మంజూరు చేయగా, ఇందులో మొదటి విడత రుణంగా రూ.3,535 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు నేడు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. దీంతో అమరావతి నిర్మాణానికి మరింత సహాకారం అందనుంది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుండి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏడీబీ రూ.6,700 కోట్ల రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల నుండి రూ.13,600 కోట్లు రుణం రూపంలో అందుతుండగా, అదనంగా రూ.1,400 కోట్లు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయంగా అందిస్తోంది. మరోవైపు హడ్కో నుండి రూ.11 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు