స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న తాజా చిత్రం ‘జాక్’. “కొంచెం క్రాక్” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా, ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఈ మేరకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్రబృందం,ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.ట్రైలర్ చూస్తుంటే సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ అనే ప్రైవేట్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ట్రైలర్‌లోని డైలాగులు,యాక్షన్ సన్నివేశాలు,సిద్ధు పాత్రలోని యూనిక్ మేనరిజం సినిమాపై అంచనాలను పెంచాయిస్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్ధుకు యూత్‌ఫుల్ గ్లామర్ అండ్ మాస్ అపీల్ ఉన్న పాత్ర దక్కినట్లు అనిపిస్తోంది.ఇందులో సిద్దు సరసన వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుంది.‘డీజే టిల్లు’ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధు,‘జాక్’తో మరోసారి హిట్ అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు.ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో నరేష్,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఆడియో,ప్రమోషనల్ కంటెంట్ బాగుండటంతో,సినిమాపై హైప్ భారీగా పెరిగింది.ఈ నెల 10న సిద్ధు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.