భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల థాయ్‌లాండ్ పర్యటన కోసం ఇవాళ బ్యాంకాక్ చేరుకున్నారు.థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది.పర్యటన సందర్భంగా మోదీ థాయ్‌లాండ్ ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.అనంతరం ఏప్రిల్ 4న శ్రీలంకకు వెళ్లనున్నారు,అక్కడ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.
శ్రీలంక పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిసనాయకేతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు, ఆర్థిక సహాయ ఒప్పందాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు.ఇక ఏప్రిల్ 4న బ్యాంకాక్‌లో జరిగే బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు.ఈ సమావేశంలో వాణిజ్యం,పెట్టుబడులు,అభివృద్ధి వంటి కీలక అంశాలపై సభ్యదేశాధినేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.