వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం నిన్న లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, నేడు ఆ బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వక్ఫ్ ఆస్తులను ముస్లిమేతరులు నిర్వహిస్తారనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని, అందులో నిజం లేదని రిజిజు స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2013లో వక్ఫ్ బిల్లుకు సవరణలు చేసిందని, ఆ తప్పులను తాము తాజాగా చేసిన సవరణలు ఏవిధంగా సరిదిద్దుతాయో కూడా వివరించారు. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని 2013లో సెలెక్ట్ కమిటీ అంగీకరించిందని, దేశంలోనే ఇది మూడవ అతిపెద్ద భూ యజమానిగా ఉన్నప్పటికీ, మైనారిటీ వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందన్నారు. వక్ఫ్ బోర్డుల కూర్పునూ వివరించారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వక్ఫ్ బోర్డుల పాలకవర్గాల్లో మహిళా సభ్యులను చేర్చడానికి సంబంధించి ఒక ముఖ్యమైన సంస్కరణను తీసుకు వచ్చినట్లు తెలిపారు. కేంద్ర వక్ఫ్ మండలిలో 10 మంది సభ్యులు అందులో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని, నలుగురు వ్యక్తులు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి వంటి జాతీయ స్థాయి ప్రముఖులు ఉంటారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు