జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ(NACO) న్యాకో తాజా నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానానికి చేరింది . దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో పనితీరు బాగా మెరుగుపర్చుకుని ఏపీ 7వ స్థానానికి చేరుకుంది. గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరును కనబరిచి తద్వారా 17వ ర్యాంక్ నుండి పైకి ఎగబాకింది. ఈ కాలంలో ఎయిడ్స్ ను నియంత్రించడంలో ఏపీ కృషిని న్యాకో ప్రశంసించింది. వివిధ ప్రమాణాల విషయంలో ఏపీశాక్స్ సాధించిన ఫలితాల్ని న్యాకో వెల్లడించింది. గతేడాది ఏప్రిల్, డిసెంబర్ మధ్యకాలంలో ఎపి శాక్స్ 90 శాతం నిధులను ఉపయోగించుకుంది. ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడంలో మంచి పని తీరును కనబర్చినందుకు ఏపీ శాక్స్ పీడీ డాక్టర్ ఎ.సిరిని, సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ అభినందించారు.
Previous Article‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ విడుదల తేదీ ఖరారు
Next Article తిరుపతి – పళని మధ్య ఆర్టీసీ సర్వీసు