తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసు నుండి తాను తప్పుకున్నట్లు కే.అన్నామలై ప్రకటించారు.పార్టీకి మంచి భవిష్యత్తు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గతంలో బీజేపీకి తమిళనాడులో బలాన్ని తీసుకువచ్చిన నాయకుడిగా ఆయనకు విశేష కీర్తి లభించింది.కానీ,తాజాగా అన్నాడీఎంకేతో పొత్తు చర్చల నేపథ్యంలో ఆయన కొనసాగడం సవాలుగా మారినట్టు సమాచారం.పార్టీ లోపల నాయకత్వ పోటీ ఉండదని, ఐక్యతతో అధ్యక్షుడిని ఎన్నుకుంటామని పేర్కొన్నారు.తన రాజీనామాపై అనవసర ఊహాగానాలు వద్దని స్పష్టం చేశారు.
బీజేపీ బలంగా ఉండాలన్నదే తన ఆశయమని, పార్టీకి తాను ఎప్పుడూ మద్దతుగా ఉంటానని తెలిపారు.ఈ పరిణామాలతో తమిళనాడు బీజేపీలో కొత్త నాయకత్వంపై ఆసక్తికర చర్చ మొదలైంది.ఎన్నికలు సమీపిస్తున్న వేళ, నేతృత్వ మార్పు కీలకంగా మారనుంది.అన్నామలై రాజీనామా వెనుక రాజకీయ వ్యూహాలు దాగివున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా,బీజేపీకి కొత్త నాయకత్వం అవసరమని భావిస్తున్నట్లు సమాచారం.అన్నామలై అధ్యక్షుడిగా ఉంటే పొత్తు కొనసాగించడం కష్టమని అన్నాడీఎంకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.