దళితులు, ఆదివాసీల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకాలకు బడ్జెట్ లో న్యాయమైన వాటా ఉండే విధంగా చట్టం అవసరమని వారికి అధికారంలో భాగం ఇవ్వడానికి సరైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తాజాగా ఆయన దళితులు మరియు ఆదివాసీలకు చెందిన పరిశోధకులు, ఉద్యమకారులు మరియు సామాజిక సేవకుల ప్రతినిధి బృందాన్ని కలిసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఇక ఈ తరహా చట్టం ఇప్పటికే కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అమలులో ఉందని దీని ఫలితంగా, ఆ రాష్ట్రాల్లో దళితులు మరియు ఆదివాసీలకు గణనీయమైన ఫలితాలు లభిస్తున్నాయని వివరించారు. జాతీయ స్థాయిలో కూడా, యుపీఏ ప్రభుత్వం “సబ్-ప్లాన్స్” అనే దానిని ప్రవేశపెట్టింది. అయితే మోడీ ప్రభుత్వం ఈ విధానాన్ని బలహీనపరిచింది మరియు ఈ సముదాయాలకు కేవలం చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే బడ్జెట్‌లో కేటాయిస్తుందని అన్నారు.దళితులు మరియు ఆదివాసీల అవసరాలను తీర్చడానికి రూపొందించిన పథకాలకోసం బడ్జెట్‌లో గణనీయమైన వాటాను పొందే విధంగా భరోసా ఇచ్చే జాతీయ చట్టం అవసరమని పేర్కొన్నారు.
దళితులు, ఆదివాసీలకు కేంద్ర బడ్జెట్‌లో ఒక నిర్దిష్ట వాటాను కేటాయించే జాతీయ చట్టం: రాహుల్ గాంధీ
By admin1 Min Read