పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘ఎల్2 ఎంపురాన్’ సినిమా వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.బీజేపీ హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అభిప్రాయాలు రావడంతో కేంద్రం ఈ చిత్రాన్ని లక్ష్యంగా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే కొన్ని సన్నివేశాలు తొలగించడమే కాక,నటుడు మోహన్‌లాల్‌ను క్షమాపణలు చెప్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.తాజాగా ఈ చిత్ర నిర్మాత గోకులం గోపాలన్‌పై ఈడీ దాడులు జరపగా, దర్శకుడు పృథ్వీరాజ్‌కు ఐటీ శాఖ నుండి నోటీసులు అందాయి.2022లో నిర్మించిన *‘జన గణ మన’, ‘గోల్డ్’, ‘కడువ’ సినిమాల లాభాలపై స్పష్టత ఇవ్వాలంటూ ఐటీ శాఖ ఆదేశించింది.ఈ సినిమాల ద్వారా రూ.40 కోట్లు లాభం వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పృథ్వీరాజ్ తల్లి మల్లిక సుకుమారన్ స్పందిస్తూ, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, విచారణకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కేంద్రం కావాలనే ఈ చిత్ర బృందాన్ని టార్గెట్ చేస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.
Previous Articleకునాల్ కమ్రాకు షాక్…బుక్‌మైషోలో నుండి తొలగింపు…!
Next Article తలైవా రజనీకాంత్ 171వ చిత్రం ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల