స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రాకు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ *బుక్‌మైషో* ఊహించని షాక్ ఇచ్చింది.కళాకారుల జాబితా నుంచి కమ్రాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేపై కమ్రా ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయగా,శివసేన నేతలు బుక్‌మైషో సీఈవో ఆశిష్ హేమరాజనికి కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి రాహుల్ కనాల్ లేఖ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు.ముంబై కళలను గౌరవించే నగరమని,కానీ వ్యక్తిగత ఎజెండాలకు ప్రోత్సహం ఉండదని స్పష్టం చేశారు.బుక్‌మైషో విలువలకు, నాయకత్వానికి అభినందనలు తెలుపుతూ కమ్రా వ్యాఖ్యలు శాంతికి భంగం కలిగించేవని పేర్కొన్నారు.కాగా,శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు హాబిటాట్ కామెడీ క్లబ్ పై కేసు నమోదు చేశారు.
Previous Articleపంబన్ రైలు వంతెనను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ
Next Article దర్శకుడు పృథ్వీరాజ్‌కు ఐటీ నోటీసులు