‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్’ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024–25 సంవత్సరానికి దేశంలో రెండవ అత్యధిక వృద్ధిరేటు 8.21% తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీని తిరిగి ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మార్గంలోకి తీసుకురావడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని పేర్కొన్నారు . ఈసందర్భంగా లోకేష్ హార్షం వ్యక్తం చేశారు. 2024–25లో 8.21% అద్భుతమైన వృద్ధితో (గతేడాది 6.18% నుండి పెరిగి), ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. మన రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి రూ.8.73 లక్షల కోట్లకు పెరిగింది. ఇది దార్శనిక నాయకత్వం, ఆర్థిక క్రమశిక్షణ మరియు మంచి పాలనకు నిదర్శనమని నిజమైన సంస్కర్త నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు