భారతదేశంలో మొత్తం బ్యాంకు ఖాతాల్లో 39.2 శాతం మహిళల పేరిట ఉండగా, గ్రామీణ ప్రాంత మహిళల ఖాతాల శాతం పట్టణాలను మించి 42.2 శాతంగా ఉంది.గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024’ నివేదిక ఈ అంశాన్ని బట్టబయలుచేసింది.బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా 39.7 శాతంగా ఉండటం విశేషం.డీమ్యాట్ ఖాతాల్లో మహిళల ప్రాతినిధ్యం నాలుగు రెట్లు పెరిగిందని నివేదిక తెలిపింది.2021లో 0.667 కోట్ల నుంచి 2024లో 2.771 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.ఎన్నికల్లో కూడా మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగి లింగ ఆధారిత ఓటింగ్ అంతరాన్ని తగ్గించింది.వ్యాపార, సేవారంగాల్లో మహిళల యాజమాన్యం గల సంస్థల సంఖ్య పెరిగింది. 2017లో 1,943 స్టార్టప్‌లుండగా 2024లో 17,405గా పెరిగాయి.విద్యా రంగంలో లింగ సమానత్వం మెరుగుపడుతోందని నివేదిక పేర్కొంది.మహిళల ఆర్థిక, సామాజిక పురోగతికి ఇది చక్కటి సంకేతంగా కనిపిస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు