కేరళలోని పెరుంబవూర్ ప్రాంతంలో ఉద్యోగులపై అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లక్ష్యాలు చేరుకోలేదని ఉద్యోగులను కుక్కలా నడిపించడం,నేలపై నాణేలను నోటితో తీయించడంతో సంచలనం రేగింది.ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.ఇది స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలో జరిగిందని తెలుస్తోంది.పనితీరు బాగా లేకపోతే ఉద్యోగులను ఇలాంటి అవమానకర శిక్షలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటనపై కొంతమంది ధైర్యంగా బయటకు వచ్చి వాస్తవాలు వెల్లడించగా,మరికొందరు భయంతో మాట్లాడటం లేదు.ఉద్యోగుల హక్కుల్ని కాలరాసే ఈ చర్యపై తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది.విషయం తెలుసుకున్న కేరళ కార్మిక శాఖ ఘటనపై విచారణ ప్రారంభించింది.బాధిత ఉద్యోగులకు న్యాయం జరగాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కేరళలో ఉద్యోగులపై అమానుష ఘటన…కుక్కలా నడిపించి,నోటితో నాణేలు తీయించిన కంపెనీ
By admin1 Min Read