ప్రఖ్యాత భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం లభించింది.ఇసుక శిల్ప కళలో చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకు ‘ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్’ లభించింది.ఈ అవార్డును శనివారం ఇంగ్లండ్‌లోని వేమౌత్‌లో ప్రారంభమైన 2025 ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్‌లో అందజేశారు.నగర మేయర్ జాన్ ఓరెల్ ప్రత్యేకంగా మెడల్‌తో పాటు అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.కార్యక్రమంలో సుదర్శన్ ‘ప్రపంచ శాంతి’ అనే సందేశంతో వినాయకుడి 10 అడుగుల ఎత్తు శిల్పాన్ని ఆవిష్కరించారు.ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కళాకారుడిగా ఆయన రికార్డు సృష్టించారు.ప్రపంచవ్యాప్తంగా 65 మంది శిల్పకళాకారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఫ్రెడ్ డారింగ్టన్ పేరిట ప్రతీవ సంవత్సరం ఈ పురస్కారాన్ని బ్రిటన్ అందజేస్తోంది.భారతీయ కళను ప్రపంచానికి పరిచయం చేసిన పట్నాయక్ కృషికి ఇది గుర్తింపుగా నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు