రానున్న 5 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కోడింగ్‌లో 95 శాతం కృత్రిమ మేధస్సుతోనే (AI) జరుగుతుందని మైక్రోసాఫ్ట్ సీటీఓ కెవిన్ స్కాట్ తెలిపారు.రొటీన్, లైన్-బై-లైన్ కోడింగ్ ఇక మాన్యువల్‌గా జరగదని,డెవలపర్లు ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టాలన్నారు. సంక్లిష్ట ఇంజినీరింగ్ సమస్యలకు మాత్రం మానవ డెవలపర్లే కీలకమని చెప్పారు.ఏఐ,డెవలపర్లకు ప్రత్యామ్నాయం కాకుండా, వారి పనితీరును మెరుగుపరుస్తుందని స్పష్టం చేశారు.అనుభవజ్ఞులైన కోడర్లకు ఇది ఫోర్స్ మల్టిప్లయర్‌గా పనిచేస్తుందని వివరించారు.ఏఐ టూల్స్‌తో నాన్-టెక్ యూజర్లు కూడా యాప్‌లు, వెబ్‌సైట్లు తయారుచేసే అవకాశాలు పెరిగాయని తెలిపారు.భవిష్యత్తులో బాయిలర్‌ప్లేట్ కోడ్ రాయడం కన్నా సృజనాత్మకతపై ఫోకస్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.ప్రారంభ అభివృద్ధి దశల్లో యూఐ/యూఎక్స్, క్యూఏ వంటి మధ్యంతర పాత్రలు తగ్గుతాయని చెప్పారు. ప్రపంచంలోని క్లిష్టమైన కంప్యూటేషన్ సమస్యల పరిష్కారానికి కంప్యూటర్ సైంటిస్టుల అవసరం ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్యానించారు AI, డెవలపర్ సామర్థ్యాన్ని విస్తృతం చేయనున్నదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
రానున్న 5 ఏళ్లలో లైన్ బై లైన్ కోడింగ్‌కు మనుషులు అవసరంలేదు…!
By admin1 Min Read
Previous Articleప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కి అంతర్జాతీయ గౌరవం
Next Article ‘సీతా పయనం’లో ధ్రువ సర్జా పవర్‌ఫుల్ లుక్ విడుదల…!