పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాలను పక్కన పెట్టింది.ముఖ్యంగా అదనపు టీచర్ పోస్టుల సృష్టిపై దర్యాప్తు అవసరం లేదని తెలిపింది.విద్యాశాఖ నిపుణుల కమిటీ సలహాలతోే ఆ నిర్ణయం తీసుకుందని,గవర్నర్ ఆమోదించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం అవసరం లేదని పేర్కొంది.అయితే 25,753 మంది నియామకాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.2016లో 24,650 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా,23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.పరీక్ష అనంతరం ప్రభుత్వం 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేసింది.ఖాళీల కన్నా ఎక్కువ మందిని నియమించడంపై వివాదం మొదలైంది.దీనిపై హైకోర్టు నియామకాలు చెల్లవని పేర్కొంటూ సీబీఐ దర్యాప్తు ఆదేశించింది.
బెంగాల్ ఉపాధ్యాయ నియామక వివాదంపై సుప్రీంకోర్టులో మమత బెనర్జీ ప్రభుత్వానికి ఊరట..!
By admin1 Min Read