సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెట్టినందుకు బ్రిటన్‌లో అరెస్టుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. టైమ్స్ పత్రిక విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 12,000 మందిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ముఖ్యంగా 2003 కమ్యూనికేషన్స్ యాక్ట్ సెక్షన్ 127, 1988 చట్టంలోని సెక్షన్ 1 ప్రకారం అసభ్య, అశ్లీల కాంటెంట్ షేర్ చేసిన యూజర్లపై కేసులు నమోదవుతున్నాయి.2023లో 37 పోలీసు శాఖల నుంచి 12,183 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంటే రోజుకు సగటున 33 మందిని అరెస్టు చేస్తున్నట్టు అంచనా.2019తో పోలిస్తే ఇది 58 శాతం పెరుగుదల.అయితే ఈ కేసుల్లో నేర నిర్ధారణ, కోర్టు తీర్పుల సంఖ్య కేవలం సగం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.చాలా కేసులు కోర్టు వెలుపలే సెటిల్ అవుతున్నాయి.ఇది పౌర హక్కుల పరిరక్షకుల్లో ఆందోళనకు దారితీస్తోంది.సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అతిగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియా పోస్టులకు అరెస్టులు పెరుగుతున్న బ్రిటన్ – ఏడాదికి 12 వేల మంది అదుపులోకి..!
By admin1 Min Read