లక్నో సూపర్ జెయింట్స్:238-3 (20).
కోల్ కతా నైట్ రైడర్స్:234-7 (20).
కోల్ కతా వేదికగా జరిగిన కోల్ కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పరుగుల వరదపారిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు మార్క్‌క్రమ్, మిచెల్ మార్ష్ ఏకంగా 99 పరుగుల కీలక పార్టనర్ షిప్ అందించారు. మార్క్‌క్రమ్ 28 బంతుల్లో 47 పరుగుల చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడ్డారు. మార్ష్ 48 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. నికోలస్ పూరన్ అజేయంగా 36 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్ కతా బ్యాటర్లు కూడా చెలరేగారు. కెప్టెన్ అజింక్య రహానే 61 (35; 8×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. వెంకటేష్ అయ్యర్ 45 (29; 6×4, 1×6), సునీల్ నరైన్ 30 (13; 4×4, 2×6), రింకూ సింగ్ 38 నాటౌట్ (15; 6×4, 2×6) పరుగులతో ఆకట్టుకున్నారు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్ 2 వికెట్లు, శార్థుల్ ఠాకూర్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు.
భారీ స్కోరింగ్ మ్యాచ్ లో లక్నోదే పైచేయి… కోల్ కతా పై 4 రన్స్ తేడాతో గెలుపు
By admin1 Min Read
Previous Articleఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష… ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ
Next Article మళ్లీ ఓడిన చెన్నై… పంజాబ్ కింగ్స్ ఖాతాలో మరో విజయం