అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. తమ దేశం విధించే టారిఫ్ లకు అనుగుణంగానే ఆయా దేశాలపై తాను టారిఫ్ లు వసూలు చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ఈ టారిఫ్ లకు సంబంధించి కీలక వివరాలను ఆయన తెలిపారు. తాజాగా వైట్ హౌస్ లో కేబినెట్ సభ్యులు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాజా టారిఫ్ లతో అమెరికాకు భారీగా లాభం చేకూరుతుందన్నారు.
రోజుకు 2 బిలియన్ డాలర్లు అమెరికా వాల్ట్ లో జమవుతున్నాయని తెలిపారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని వస్తువులపై వసూలు చేస్తున్న మినిమమ్ టారిఫ్ ధనం కూడా ఇందులో ఉందన్నారు. కాగా, టారిఫ్ ల విషయంలో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ మరోమారు పేర్కొన్నారు. ఈ విషయంలో జపాన్, సౌత్ కొరియా దేశాలు ముందుకు వచ్చాయని అన్నారు. ట్రంప్ జపాన్ పై 24 శాతం, సౌత్ కొరియాపై 25 శాతం టారిఫ్ లు విధించారు. దీనిపై చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ వస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మరోవైపు, తాను విధించిన ప్రతీకార సుంకాలకు చైనా కౌంటర్ గా 34 శాతం పన్నులు విధించడంపై ట్రంప్ ఫైర్ అయ్యారు. చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్ విధించారు. చైనాపై గతంలో 20 శాతం పన్ను వసూలు చేస్తుండగా.. ట్రంప్ 34 శాతం రెసిప్రోకల్ టారిఫ్స్ విధించారు. తాజాగా 50 శాతం అదనపు సుంకాలతో చైనాపై అమెరికా విధించిన పన్ను మొత్తం 104 శాతానికి చేరింది. ఈ టారిఫ్ లు తాజాగా నేడు అమలులోకి వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Previous Articleభారత షూటర్ సురుచి సింగ్ కు గోల్డ్ మెడల్
Next Article ఎన్టీఆర్-నీల్ మూవీ నుండి బిగ్ అప్ డేట్