భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
జైన మతస్థుల ఆరాధ్య దైవం… అహింస, సత్యం తదితర పంచ సూత్రాలను ప్రబోధించిన ధర్మ ప్రచార కర్త మహావీర జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. మానవాళికి శాంతి, అహింసలతో కూడిన గొప్ప సందేశాన్ని అందించిన మహావీరుని స్ఫూర్తిగా మనందరం శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం.
ఏపీ మంత్రి నారా లోకేష్:
ప్రపంచంలోని సమస్త ప్రాణుల పట్ల కరుణ చూపాలని భగవాన్ మహావీర్ బోధించారు. శాంతి, సహనం, సమ్యక్ జ్ఞానం అనే విలువలు మానవాళికి బోధించిన మహావీరుని జీవిత సందేశం అందరికీ ఆదర్శం. భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా జైన సోదరులకు శుభాకాంక్షలు.