మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కు(ఎస్ఎల్ఎన్ పార్క్)ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 0.35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ను రూ.1.06 కోట్లతో అభివృద్ధి చేసారు. మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నాంట్లు లోకేష్ తెలిపారు. మంగళగిరిలోని టిడ్కో పార్క్ ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం, ఇందుకు సంబంధించిన పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. నులకపేట, చినకాకానిలో లేక్ పార్కులను కూడా అభివృద్ధి చేసి వాకర్స్ కి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశలవారీగా అభివృద్ధి
By admin1 Min Read