ముంబై పేలుళ్లకు సూత్రధారి తహావూర్ రాణాను భారత్ కు రప్పించడం భారత్ కు అతిపెద్ద దౌత్య విజయం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. భారత దేశానికి, ఇక్కడి ప్రజలకు హాని కలిగించే వారిని ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. బాంబు పేలుళ్లు ఎవరి హాయాంలో జరిగాయో వారు అతడిని వెనక్కి రప్పించలేకపోయారు కానీ మేము వారిని తిరిగి తీసుకొస్తున్నాం తహావ్వూర్ ను రప్పించడం భారత్ కు అతిపెద్ద దౌత్య విజయం. ఇది మోడీ ప్రభుత్వం దౌత్య నైపుణ్యాన్ని, న్యాయం పై నిబద్ధతను తెలియజేస్తుందని అమిత్ షా అన్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని మోడీ ప్రభుత్వం వెంటాడుతుందన్నారు.
ఇది భారత్ కు అతిపెద్ద దౌత్య విజయం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
By admin1 Min Read
Previous Articleభారత్ చేరిన ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా
Next Article రవితేజ ‘మాస్ జాతర’ నుండి ఈనెల 14న ఫస్ట్ సింగిల్